హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచంపల్లిలో వీధికుక్కల స్వైరవిహారం

BHNG: భూదానపోచంపల్లి మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వీధికుక్కల బెడద పెరిగింది. కుక్కలు గుంపులుగా సంచరిస్తూ పాదచారులు, చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. గత 7 నెలల్లో 49 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. కుక్కలు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కుక్కల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.