హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శివనామస్మరణతో మార్మోగిన శివాలయం

SRPT: పట్టణంలోని శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి దీపారాధన చేశారు.