హైదరాబాద్: 28°C
క్రైమ్

ఇన్‌స్టాలో పరిచయం.. ఘరానా చోరీ

AP: విశాఖపట్నంలో ఓ మహిళ ఘరానా చోరీకి పాల్పడింది. ఇన్‌స్టాలో పరిచయమైన ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి భారీ మోసానికి తెరతీసింది. అనారోగ్యంతో బాధపడుతున్నానంటూ వచ్చి రోజుల తరబడి ఇంట్లో మకాం వేసింది. ఎవరికీ అనుమానం రాకుండా బీరువాలోని బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లింది. నగలు చోరీకి గురైనట్లు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.