TG: హైదరాబాద్లో భారీ డిజిటల్ అరెస్ట్ మోసం వెలుగులోకి వచ్చింది. 72 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగినికి నేరగాళ్లు టోకరా వేశారు. ముంబైలో అక్రమ బ్యాంకు ఖాతా తెరిచారంటూ, మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. సైబర్ క్రైమ్ పోలీసులమంటూ డిజిటల్ అరెస్ట్ పేరుతో బాధితురాలి నుంచి రూ.1.42 కోట్లు కాజేశారు. ఆలస్యంగా మోసాన్ని గుర్తించిన బాధితురాలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రైమ్
డిజిటల్ అరెస్ట్ అంటూ రూ.1.42 కోట్లు కాజేశారు!


