హైదరాబాద్: 28°C
వార్తలు

సచిన్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడిన బ్రిటన్ యువరాజు

పదేళ్ల తర్వాత మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ ముంబైలో సందడి చేశారు. ఓ పాఠశాలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి విలియం క్రికెట్ ఆడారు. అనంతరం విలియం, కేట్, సచిన్ ముగ్గురూ కలిసి ముంబై వీధుల్లో సందడి చేశారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతోనూ విలియం దంపతులు భేటీ కానున్నారు.