హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు అశ్వక్ ఎంపిక

సత్యసాయి: పెనుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి అశ్వక్ లధిమ్ ఉమ్మడి అనంతపురం జిల్లా అండర్-14 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఆదివారం జరిగిన జిల్లా స్థాయి ఎంపికల్లో బౌలింగ్‌తో రాణించి చోటు దక్కించుకున్నారు. ఈ నెల 21న శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ఆడనున్నారు. కుమ్మరదొడ్డి ప్రాంతానికి చెందిన అశ్వక్‌ను పలువురు అభినందించారు.