హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎచ్చెర్లలో రోడ్డు మరమ్మత్తులు పనులు

SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రం నుంచి కుప్పిలి, కొయ్యాం, బడివారిపేట, తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డులో గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. సోమవారం కూలీలు తారుతో రోడ్డుపై గుంతలను పూడ్చారు. గుంతల వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పనులు పూర్తైతే ప్రయాణం సులభమవుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.