హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

KRNL: కర్నూలు రూరల్ మండలం దూపాడు జాతీయ రహదారి రింగ్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి దాటుతున్న సుమారు 45 ఏళ్ల మహిళను గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.