WG: నరసాపురం పట్టణం రాయిపేటలో చిక్కాల వారి వీధి సమీపంలో చెత్తకు నిప్పు పెట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి అంతా పొగ కమ్మేయడంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జన ఆవాసాలలో చెత్తను కాల్చేయడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతోందని ఆందోళన చెందుతున్నారు. చెత్త తరలించడంలో పర్యవేక్షణ ఉండాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపాలిటీ సిబ్బందిపై స్థానికుల ఆగ్రహం


