హైదరాబాద్: 28°C
వార్తలు

మనీలా పర్యటనపై మోదీ కీలక ప్రకటన

మనీలా పర్యటనలో భాగంగా తూర్పు ఆసియా సదస్సులో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం ఇతర దేశాల నేతలతోనూ చర్చిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. ప్రాంతీయ, ప్రపంచ సవాళ్లపై ఇక్కడ ప్రధానంగా చర్చ జరగనుందన్నారు. అలాగే ఫిలిప్పీన్స్‌లో ఉంటున్న ప్రవాస భారతీయులతో కూడా సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనతో ఆసియాన్ దేశాలతో భారత్ భాగస్వామ్యానికి కొత్త శక్తి వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.