అన్నమయ్య: కార్తీక సోమవారం సందర్భంగా పెద్దమండ్యంలోని శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే ఆలయానికి తరలివచ్చిన భక్తులు.. స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు కేదారేశ్వర నోములు ఆచరించారు. కార్తీక సోమవారం రోజన శివుడిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని అర్చకులు మణికంఠ శర్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దమండ్యంలో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు!


