ఢిల్లీలో జరిగిన ఓ సమ్మిట్‌లో సీడీఎస్ జనరల్ రాజా సుబ్రమణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక యుద్ధాల్లో మారుతున్న ఆర్థిక సమీకరణాలను వివరించారు. ఖరీదైన పేట్రియాట్ క్షిపణులను కేవలం 2500 డాలర్ల విలువైన డ్రోన్లు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఒక మిలియన్ డాలర్ల క్షిపణితో చౌకైన డ్రోన్‌ను ఛేదించడం నష్టమన్నారు. అందుకే ఖరీదైన వాటితో పాటే చౌకైన ఆయుధాలూ తయారు చేయాలన్నారు.
వార్తలు
‘ఖరీదైన ఆయుధాలతో పాటే చౌకైనవి అవసరం’


