హైదరాబాద్: 28°C
వార్తలు

గన్ పట్టిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గన్ పట్టిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. పూణెలోని(మహారాష్ట్ర) కల్యాణి-భారత్ ఫోర్జ్ ప్లాంట్‌ను ఆయన సందర్శించారు. అక్కడ తయారైన ఓ మెషిన్ గన్‌ను చేతిలోకి తీసుకుని గురిపెడుతూ ఫొటోకు పోజులిచ్చారు. రక్షణ ఉత్పత్తుల్లో గ్లోబల్ ట్రెయిల్ బ్లేజర్‌గా ఉన్న భారత్ ఫోర్జ్.. మన దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందని ఈ సందర్భంగా అమిత్ షా 'X'లో పోస్ట్ చేశారు.