హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌లో యువకుడి మృతి

MBNR: జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో విచారణకు వచ్చిన వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన వరుణ్ (25) అనుమానాస్పదంగా మృతి చెందాడు. హోటల్‌లో రూ.30 వేల నగదు, ల్యాప్‌టాప్ చోరీ ఆరోపణలపై పోలీసులు విచారణకు పిలిచారు. స్టేషన్‌లో అస్వస్థతకు గురై ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. అయితే పోలీసుల దాడి వల్లే మృతి చెందాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.