హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో వనపర్తి విద్యార్థిని ప్రతిభ

WNP: కామారెడ్డి జిల్లాలో జరిగిన 70వ రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో వనపర్తి జిల్లా జట్టు రెండో స్థానం సాధించింది. వనపర్తి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ 8వ తరగతి విద్యార్థిని ప్యారసాని అర్చన అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్, జ్ఞాపిక అందుకుంది. జిల్లా కీర్తిని పెంచిన అర్చనను ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు అభినందించారు.