హైదరాబాద్: 28°C
వార్తలు

ఫిలిప్పీన్స్ పర్యటనకు బయల్దేరిన మోదీ

ప్రధాని మోదీ రెండు రోజుల ఫిలిప్పీన్స్ పర్యటనకు బయలుదేరారు. ఇవాళ రేపు మనీలాలో జరగనున్న 23వ ఆసియాన్-ఇండియా, 21వ తూర్పు ఆసియా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ ఏడాది ఆసియాన్ ఛైర్మన్‌గా ఉన్న ఫిలిప్పీన్స్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఆసియాన్ దేశాలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.