హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు

TG: సికింద్రాబాద్ హకీంపేటలోని CRPF గ్రూప్ సెంటర్ వేదికగా ఇవాళ్టి నుంచి ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు నిర్వహించనున్నారు. CRPF ఆధ్వర్యంలో హార్మొనీ ఇన్ సర్వీస్ నినాదంతో ఈనెల 20వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి డీజీపీ సీవీ ఆనంద్ హాజరై పోటీలను ప్రారంభిస్తారు. ముగింపు వేడుకలకు కేంద్రమంత్రి బండి సంజయ్ హాజరుకానున్నట్లు సమాచారం.