సూర్యాపేటకు చెందిన తోట శ్యాం ప్రసాద్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఆయన నియామకంపై జిల్లా రెడ్‌క్రాస్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
తెలంగాణ
రెడ్‌క్రాస్ కమిటీలో సూర్యాపేట వాసికి చోటు


