SRD: సిర్గాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఆండాలమ్మ తెలిపారు. రెవెన్యూ, పంచాయతీ, నీటిపారుదల, వ్యవసాయ, విద్య, వైద్యం, పోలీస్ తదితర శాఖల అధికారులు హాజరవుతారని, మండల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ
సిర్గాపూర్ మండల ప్రజలకు ముఖ్య గమనిక


