నాలుగు రోజుల పాటు జరిగిన ఛత్ మహా పర్వదినం ఘనంగా ముగిసింది. సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడంతో ఈ ఉత్సవాలు ముగిశాయని ప్రధాని మోదీ 'X' వేదికగా పోస్ట్ చేశారు. 'ప్రకృతికి అంకితమైన ఈ పండుగలో ఆధ్యాత్మిక సాధన కనిపించింది. వ్రతం ఆచరించిన భక్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరిపై ఛట్టీ మాత ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నా' అని మోదీ పేర్కొన్నారు.
వార్తలు
ఛత్ పూజల ముగింపుపై ప్రధాని పోస్ట్


