హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఆస్కార్ రావు

చిత్తూరు: LBB టవర్స్‌లో INTUC-3194 జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కార్ రావు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. ఈ క్రమంలోనే జిల్లా అధ్యక్షుడిగా ఎ.లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.