హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రేయసి పెంపుడు కుక్కలపై దాష్టీకం

కోల్‌కతాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రేయసికి చెందిన పెంపుడు కుక్కలను సంజీబ్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా ఆమెకు చూపిస్తూ వేధించాడు. ఓ కుక్కను ఉరివేసి, మరికొన్నింటిని ఇటుకలు, రాళ్లతో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.