హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మోపిదేవిలో భక్తులు అవస్థలు

కృష్ణా: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని తలపిస్తోంది. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.