ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలోని జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మార్కండేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు


