హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి తక్కువ ధరకే బియ్యం విక్రయాలు

ప్రకాశం: చీమకుర్తి విశాల సహకార పరపతి సంఘం ద్వారా సోమవారం నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు పూనాటి వెంకట్రావు తెలిపారు. బీపీటీ కిలో రూ. 49, కేఎన్ఎం సన్నాలు కిలో రూ.50 చొప్పున విక్రయిన్నట్లు చెప్పారు. స్థానిక పిడతలపూడి రోడ్డులోని మాజేటి సువర్చలాదేవి రోటరీక్లబ్ కూరగాయల మార్కెట్ ఆశరణలో బియ్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.