హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పెద్దమల్లారెడ్డిలో పాలకవర్గ ప్రమాణ స్వీకారం

KMR: భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు. గ్రామంలోని వీరభద్ర కళ్యాణమండపంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. మండలంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.