BPT: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. దీంతో ఆలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
కార్తీక సందడి.. ఆలయాలకు భక్తుల తాకిడి

