E.G: రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మేయర్ పదవికి వైసీపీకి రెబల్ పోటీ ఎదురుకానుంది. ఆ పార్టీ నేత, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. దీంతో వైసీపీ శిబిరంలో గుబులు మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి రెబల్ బెడద

