హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి ఘాట్‌కు పోటెత్తిన భక్తులు

E.G: కార్తీక మాసం సోమవారం సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం నదిలో దీపాలు వదులుతున్నారు. పుష్కర ఘాట్‌తో పాటు కోటిలింగాల, గాయత్రి ఘాట్‌ల వద్ద కూడా భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక పూజలతో ఘాట్లన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.