హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరం మున్సిపల్ పీఠంపై సస్పెన్స్‌కు తెర.. జనసేన అభ్యర్థి ఖరారు!

W.G: భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠంపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చుండూరు మల్లేశ్వరి పేరును జనసేన అధిష్టానం ఖరారు చేసింది. ఇవాళ మున్సిపల్ కార్యాలయంలో ఆమె తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధిష్టానం నిర్ణయంతో స్థానిక జనసేన నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.