హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుమ్మపాలలో కూటమి అభ్యర్థి నామినేషన్ సందడి

AKP: తుమ్మపాల మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కూటమి మద్దతుతో ఆడారి జగదీశ్వరి గోవిందరావు నామినేషన్ దాఖలు చేశారు. ఏలేరు కాలువ వద్ద నుంచి సుమారు మూడు వేల మందితో నిర్వహించిన భారీ ర్యాలీ రాజకీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో తుమ్మపాలలో ఎన్నికల సందడి తారాస్థాయికి చేరింది.