WG: పాలకొల్లు మున్సిపాలిటీలో CPM పార్టీ 3 వార్డుల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు సోమవారం నామినేషన్లు వేయాలని కమిటీ నిర్ణయించినట్లు మండల కన్వీనర్ బాతిరెడ్డి జార్జి తెలిపారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పాలకొల్లు పార్టీ ఆఫీస్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం 31, 32, 35 వార్డులకు పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లు ఎన్నికల బరిలో CPM పోటీ..!


