హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కడపలో ప్రజావాణి రద్దు!

కడప కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి డిసెంబర్ 3వ తేదీ వరకు అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగనుందని తెలిపారు.