హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక'

PPM: పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ అద్యక్షతన ఆదివారం సీతంపేట జనసేన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని MLA పిలుపునిచ్చారు. గ్రామస్థాయి విభేదాలకు తావులేకుండా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు.