BPT: చెరుకుపల్లి మండలం కనగాలలో ఉచిత ధ్యాన తరగతులు నిర్వహించనున్నట్లు హార్ట్ ఫుల్నెస్ సంస్థ జోనల్ కో-ఆర్డినేటర్ రామకోటేశ్వరరావు తెలిపారు. శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 18 వరకు గ్రామంలోని కల్యాణ మండపం రోడ్డులోని సంస్థ ధ్యాన కేంద్రం వద్ద తరగతులు ఉంటాయన్నారు. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని, ఆసక్తి ఉన్నవారు హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుండి ఉచిత ధ్యాన తరగతులు


