హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హాఫ్ మారథాన్‌లో సత్తా చాటిన లొల్ల మాజీ సైనికుడు

కోనసీమ: పూణేలో ఆదివారం నిర్వహించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–సీఎంఈ షోల్డర్ థాన్ నాలుగో ఎడిషన్ హాఫ్ మారథాన్‌లో లొల్ల గ్రామానికి చెందిన మాజీ సైనికుడు దాట్ల శ్రీరామరాజు (47) ప్రతిభ చాటారు. 21.1 కిలోమీటర్ల పరుగును కేవలం 1 గంట 21 నిమిషాల్లో పూర్తి చేసి వ్యక్తిగత ఉత్తమ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా భారత సైన్యం ప్రతినిధుల చేతుల మీదుగా పతకాన్ని అందుకున్నారు.