హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతల ఆదాయం రూ.3.47 లక్షలు: ఛైర్ పర్సన్

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వారం సంతలో ఆదాయం రూ. 3.47,950 సమకూరింది. గత వారం సంతలో రూ. 2,98,750 రాగా, ఈ వారం అదనంగా రూ. 49,200 పెరిగింది. గొర్రెలు, మేకల సంతలో 201 ఈ- పర్మిట్లు జారీ చేయగా రూ.2,06,150 వచ్చింది. పశువుల సంతలో 157 ఈ- పర్మిట్లు జారీ చేయగా రూ.1,41,800 ఆదాయం వచ్చిందని ఛైర్ పర్సన్ బల్లా పల్లవి తెలిపారు.