హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీలేరులో మైనర్లకు కౌన్సెలింగ్

అన్నమయ్య: పీలేరు మండలం బోడంపల్లికి చెందిన మైనర్ బాలుడు వాహనం నడుపుతూ హల్‌చల్ చేయడంపై పోలీసులు స్పందించారు. బాలుడితో పాటు తల్లిదండ్రులను పీలేరు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి సీఐ వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదకరమని, పిల్లలకు డ్రైవింగ్ చేయనియవద్దని మైనర్ల తల్లిదండ్రులకు సీఐ సూచించారు.