హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో రూ.5 లక్షల చోరీ కేసు ఛేదన

KDP: ప్రొద్దుటూరులో ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించారు. రెండు రోజుల క్రితం మోడంపల్లి చాకలి వీధిలో రాజారామ్ ఇంట్లో రూ.5,10,000 చోరీ అయింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4,04,000 స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వంశీనాథ్, ఎస్సై మహబూబ్ బాషా బృందాన్ని ఎన్డీపీఓ అభినందించారు.