VSP: గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇవాళ్టి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించడం లేదని విశాఖ కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. అర్జీదారులు గమనించి కార్యాలయాలకు రావద్దని కోరారు. కోడ్ ముగిసిన తర్వాత పీజీఆర్ఎస్ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో తర్వాత ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పీజీఆర్ఎస్ రద్దు


