కృష్ణా: పెడన మండల పరిధిలోని బల్లిపర్రు కాలువ గట్టుపై జూదం ఆడుతున్న ఐదుగురిని పెడన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ గంట్ల సత్యనారాయణ సిబ్బందితో కలిసి దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జూదం ఆడుతున్న ఐదుగురి అరెస్ట్


