కృష్ణా: మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన వైసీపీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ ఛైర్మన్ చలసాని వెంకటరత్నం రాజకీయ ప్రయాణం చర్చనీయాంశంగా మారింది. ఆయన గత నెల 15న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సమక్షంలో టీడీపీలో చేరారు. కాగా, ఆదివారం మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో పలు అంశాలపై ప్రజలు చర్చించుకొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల రోజుల్లో రెండు పార్టీలు మారిన చలసాని


