హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్

అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత 355 పరుగుల భారీ స్కోర్ సాధించగా, ఆసీస్‌ 220 పరుగులకే కుప్పకూలింది. 21వ శతాబ్దంలో ఆసీస్ గడ్డపై ఆ జట్టును 100+ పరుగుల తేడాతో ఓడించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డు కెక్కింది. గత 39 ఏళ్లలో స్వదేశంలో ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద పరాజయం.