JN: జాఫర్డ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ పర్యటించారు. రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి లభ్యత, నేల స్వభావానికి అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని రైతులను కోరారు.
వార్తలు
ఆరుతడి పంటలు సాగు చేయాలి: డీఏవో


