హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

JN: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన అనంతరం కౌన్సిలర్ వంగా ఉమా యుగంధర్, జిల్లా గ్రంథాలయ అధికారి టి. మధుసూదన్ రెడ్డి ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథపాలకులు బి. పద్మారావు, దోర్నాల యాదగిరి, పాఠకులు పాల్గొన్నారు.