హైదరాబాద్: 28°C
వార్తలు

BLAకు కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌

పాక్‌పై పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా రెహ్మాన్ గుల్ నియామకమయ్యారు. గతంలో పాక్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేసిన ఆయన, 2010లో బీఎల్ఏలో చేరారు. మజీద్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించిన అనుభవం ఆయనకుంది. కమాండ్ కౌన్సిల్ చర్చల అనంతరం ఈ నియామకం ఏకగ్రీవంగా జరిగినట్లు BLA ప్రకటించింది. కొత్త నాయకత్వంతో పాక్‌పై మరింత ఉద్ధృతంగా పోరాడతామని తెలిపింది.