హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒలింపిక్స్ లక్ష్యంగా BFI కీలక నిర్ణయం

2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లక్ష్యంగా భారత బాక్సింగ్ సమాఖ్య కీలక అడుగు వేసింది. స్వీడన్‌కు చెందిన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ నిపుణుడు రికార్డ్ నిల్సన్‌ను హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్‌గా నియమించింది. ఒలింపిక్స్ ముగిసే వరకు ఆయన ఈ పదవిలో ఉంటాడు. బాక్సర్ల ఫిట్‌నెస్, డేటా విశ్లేషణ బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తాడు.