MNCL: మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో బీఆర్ఎస్ ఎస్సీ సంఘం నిర్వహించిన సమావేశంలో నేత మద్ది శంకర్ మాట్లాడారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని, చెన్నూరులో సెంట్రల్ లైటింగ్, అంతర్గత రోడ్లు, పార్కులు పూర్తికాలేదని ఆరోపించారు. ఇసుక, బొగ్గు వ్యాపారాలు, నియామకాల్లో అక్రమాలపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై అధికార పక్షం స్పందన వెలువడలేదు.
తెలంగాణ
'హామీల అమలులో కాంగ్రెస్ విఫలం'


