హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం మేయర్ పోరు - వైసీపీ Vs జనసేన

శ్రీకాకుళం మున్సిపల్ మేయర్ గా వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పోటీ చేస్తున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈనెల 16న ఆమె నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా దానేటి రాధారాణి పేరు ఖరారైంది. ఆమె జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ సతీమణి.