హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్ణాటక భక్తుల కోసం వసతి గృహాలు

అన్నమయ్య: బోయకొండ గంగమ్మ ఆలయానికి తరలివచ్చే కర్ణాటక రాష్ట్ర భక్తుల సౌకర్యార్థం బోయకొండలో వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంజునాథ తెలిపారు. ఆయన ఆదివారం బోయకొండ గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వసతి గృహాలు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.